పెదకాపు టైటిల్ అందుకే పెట్టాం, ఆ డైలాగ్స్ గుచ్చుకుంటాయి... నిర్మాత కామెంట్స్ 


టైటిల్ తోనే చిత్ర వర్గాల్లో ఆసక్తిరేపింది పెదకాపు 1 చిత్రం. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 

peddakapu 1 producers clarifies why the choose that title ksr

సామాజికవర్గంతో కూడిన సినిమా టైటిల్స్ కొత్తమీ కాదు. జస్టిస్ చౌదరి నుండి వీరసింహారెడ్డి వరకు పదుల సంఖ్యలో సామాజిక వర్గం టైటిల్స్ గా ఉన్న సినిమాలు ఉన్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. పెదకాపు 1 కూడా అలాంటిదే. గోదావరి జిల్లాలో మెజారిటీ సామాజిక వర్గంగా కాపు ఉంది. దీంతో పెదకాపు అని పెట్టడం అది కూడా ఉభయగోదావరి జిల్లాల నేటివిటీ కథ కావడంతో మరింత క్యూరియాసిటీ పెంచింది. 

పెదకాపు అనేది సామాజికవవర్గం మాత్రమే కాదు గౌరవ సూచకం కూడా. గ్రామాల్లో సామాజిక వర్గంతో సంబంధం లేకుండా కాపులు, పెదకాపులు అనేవారు ఉంటారు. అయితే ఈ టైటిల్ ఎంచుకోవడం వెనుక కారణం ఏమిటో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పాడు. మొదట్లో ఈ చిత్రానికి కర్ణ అని పెడదాం అనుకున్నాము. కథ కర్ణ అనే పాత్ర చేసే పోరాటం కాబట్టి ఆ టైటిల్ సరిపోతుందని భావించాము. అయితే ఈ చిత్ర లొకేషన్స్ వేటలో శ్రీకాంత్ అడ్డాలకు పెదకాపు అనే పేరు తారసపడింది. 

దాని గురించి అడిగితే ఊరి కోసం పాటుపడిన ఓ మంచి వ్యక్తి ఆయన అని స్థానికులు అన్నారు. మన కథ కూడా అదే కాబట్టి పెదకాపు టైటిల్ పెడదాం అని శ్రీకాంత్ అడ్డాల అన్నారని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక ప్రాంతం, ఊరు, సమూహం... నాది అని పోరాటం చేసేవాడే పెదకాపు అని రవీందర్ రెడ్డి అన్నారు. కథపై నమ్మకంతో కొత్త వాళ్లతో కూడా భారీ ఎత్తున చిత్రీకరించాము. 80ల నాటి కథ నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాము. సినిమా చూస్తున్నంత సేపు వాస్తవ సంఘటనలు చూసిన భావన కలుగుతుంది అన్నాడు. శ్రీకాంత్ అడ్డాల రాసిన డైలాగ్స్ గుచ్చుకుంటాయని రవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కించారు. సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. పెదకాపు రెండు భాగాలుగా విడుదల కానుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios