తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఎన్టీఆర్ నట జీవితాన్ని రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ తండ్రి పాత్రలో వివిధం కోణాల్లో కనిపించనున్నారు. 

ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా చాలా కష్టపడుతున్నారు. ఇకపోతే సినిమాలో విద్యాబాలన్ - రకుల్ ప్రీత్ - నిత్యామీనన్ లాంటి నటీమణులు ప్రేత్యేక పాత్రలతో అలరించనున్న సంగతి తెలిసిందే. ఇక వారితో మరో నటీమణి కూడా సినిమాలో భాగం కానుంది. ఆమె మరెవరో కాదు. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును ఎట్రాక్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తరువాత చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ అమ్మడు బాగా ఆలోచించి గాని ఓకే చేయడం లేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ క్యారెక్టర్ కోసం దర్శకుడు క్రిష్.. పాయల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

‘డ్రైవర్ రాముడు, కేడీ నెంబర్1, గజదొంగ, సరదా రాముడు’’  వంటి సినిమాలతో జయప్రద ఎన్టీఆర్ జోడి హిట్ కాంబినేషన్ గా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడులో ఈ సినిమాలకు సంబందించిన ముఖ్యమైన సీన్స్ ను బాలకృష్ణ - పాయల్ తో చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం.