ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

 RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో పాయల్ కాస్త తడబడిందనే చెప్పాలి. పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మాయా పేటిక. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన రెస్పాన్స్ అయితే రావడం లేదు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాయల్ రాజ్ పుత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఒక స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ మిస్ అయినట్లుగా పాయల్ రాజ్ పుత్ పేర్కొంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. సర్కారు వారి పాట చిత్రంలో అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూశానని పాయల్ పేర్కొంది. కానీ ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కి వెళ్ళింది. అంటే ముందుగా చిత్ర యూనిట్ పాయల్ ని సంప్రదించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. కీర్తి సురేష్ ఆ మూవీలో అద్భుతంగా నటించినట్లు కూడా ప్రశంసలు కురిపించింది. 

ఈ క్రమంలో మహేష్ బాబు తన డ్రీమ్ హీరో అని కూడా పాయల్ రివీల్ చేసింది. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలనే కోరిక ఉంది అని పాయల్ తన మనసులో మాట బయట పెట్టింది.