ఉమెన్స్ డే నాడు పోలీస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చారు పాయల్ రాజ్ పుత్. ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమె లుక్ కేకగా ఉంది. ఆడవాళ్ళ గొప్పతనం గురించి అద్భుతమైన కామెంట్స్ చేశారు పాయల్. స్ట్రాంగ్ గా ఉండడానికి కండబలం అవసరం లేదని పాయల్ కామెంట్ చేశారు. అమ్మగా, చెల్లిగా, భార్యగా... ఏ రూపంలో ఉన్నా ఆడది గొప్పదే అంటూ గొప్ప విషయాలు తెలియజేశారు. 


ఇక పాయల్ పోలీస్ గెటప్ విషయానికి వస్తే ఆమె లేటెస్ట్ మూవీలోని లుక్ అని తెలుస్తుంది. పాయల్ నటిస్తున్న ఓ మూవీలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఉమెన్స్ డే నాడు పాయల్ తన లుక్ ని సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. ఇక ఏంజెల్ మూవీతో పాయల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. 


తెలుగులో పాయల్ కి అవకాశాలు తగ్గాయి. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ పాయల్ చేతిలో లేవు. గత ఏడాది పాయల్ హీరోయిన్ గా నటించిన డిస్కో రాజా విజయం సాధించలేదు. ఇటీవల అనగనగా ఒక అతిథి పేరుతో తెరకెక్కిన వెబ్ మూవీలో పాయల్ నటించడం జరిగింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput (@rajputpaayal)