పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తగ్గేదే లేదు అంటున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ నాన్ స్టాప్ గా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు పవర్ స్టార్. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమా.17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన కథతో ప్రేక్షకులను కట్టిపడేయాలని డైరెక్టర్ క్రిష్ అన్ని ఏర్పాట్లు చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఆల్ రెడీ శాతకర్ణి, మణికర్ణిక లాంటి సినిమాలతో సత్తా చాటిన క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో వస్తుండటంతో ఇండస్ట్రీతో పాటు... ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 

ఇటువంటి సినిమాలు తెకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోను స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తాడు క్రిష్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం తోటా తరణి ఆధ్యవర్యంలో భారీ ఖర్చుతో సెట్లు వేస్తున్నారు మూవీ టీమ్ దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హరిహరవీరమల్లు కరోనా ప్రభావం వలన షూటింగును వాయిదా వేశారు. 

ఇక చాలాకాలం క్రితమే 50 శాతం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, అప్పటి నుంచి పరిస్థితులు కలిసి రాకపోవడం వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేయాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడు. ఇకపై ఈ ప్రాజెక్టు లేట్ కాకూడదనే ఉద్దేశంతో ఏకధాటిగా పవన్ 5 నెలల సమయాన్ని కేటాయించినట్టుగా చెబుతున్నారు. ఆగస్టు నాటికి ఈ సినిమాను పూర్తిచేసి, ఆ వెంటనే మిగతా పనులు స్టార్ట్ చేస్తారట.

ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. పవర్ స్టార్ ఈ మధ్య వరకూ.. అటు పొలిటికల్ పనులు.. ఇటు భీమ్లా నాయక్ పనులు ఉండటంతో బిజీగా గడిపారు. లేకుంటే.. లాస్ట్ మన్త్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాల్సి ఉంది. ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. చారిత్రక నేపథ్యంలో తొలిసారిగా పవన్ చేస్తున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.