మెగాస్టార్ చిరంజీవి సైరా టీజర్ తో అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నిమిషాల్లోనే టీజర్ 5 మిలియన్  డిజిటల్ వ్యూవ్స్ తో రికార్డు సృష్టించింది. అయితే ఆగస్ట్ 22వ తేదీన మెగాస్టార్ 64వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు., 

ఈ సెలబ్రేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కానున్నారు. అభిమానులంతా కలిసి చేసుకోబోయే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జనసేనాని రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వేడుకలో హాజరు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

బుధవారం అనగా ఆగస్ట్ 21వ తేదీ శిల్పకళా వేదికగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.