పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీతోనూ జోరు పెంచారు. అది మామూలు జోరు కాదు. రెండుదశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎప్పుడూ ఇలా చేయలేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ వెళ్లారు. ప్రస్తుతం ఆయన చేతిలో అధికారికంగా ఒప్పుకున్న సినిమాలే నాలుగున్నాయి. అనాధికారంగా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడని టాక్‌. 

పవన్‌ ఇప్పటికే `వకీల్‌ సాబ్‌` షూటింగ్‌ని పూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్‌ రాబోతుంది. మరోవైపు సాగర్‌ కె చంద్ర సినిమాని ప్రారంభించారు. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ సినిమా ప్రారంభం కాబోతుందని ఇటీవల వార్తలొచ్చాయి. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి టైమ్‌ పడుతుందన్నారు. కానీ ఊహించని విధంగా క్రిష్‌ సినిమాని ప్రారంభించి అభిమానులను, ఆడియెన్స్ ని షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ చేశారు పవన్‌. 

ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం రాత్రి ప్రకటించింది. మెగాసూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెగాసూర్య ప్రొడక్షన్‌ ట్వీట్‌ చేసింది. ఇందులో షూటింగ్‌ స్టార్ట్ అయినట్టుగా ఓ చిన్న వీడియోలను కూడా పంచుకుంది. సెట్‌లో క్రిష్‌, చిత్ర బృందం బిజీగా ఉన్న ఫోటోలను పంచుకున్నారు. పవన్‌ కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు. దీంతో అభిమానులు షాక్‌ అవుతుంది. పవన్‌ ఈ ఊహించని నిర్ణయం ఓ రకంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. 

క్రిష్‌ సినిమాని, సాగర్‌ కె చంద్ర చిత్రాన్ని కంటిన్యూగా ఏకకాలంలో కంప్లీట్‌ చేసే అవకాశాలున్నాయి. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. పీరియాడికల్‌ నేపథ్యంలో బందిపోటు రాబిన్‌ హుడ్‌ పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని టాక్‌.