పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన మరలా సినిమాలలో నటిస్తున్నానని ప్రకటన చేసి ఆనందం పంచారు. ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే . హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా అనేక చిత్రాలు ప్రకటించారు. దర్శకుడు క్రిష్ తో పీరియాడిక్ మూవీ ప్రకటించిన పవన్... దర్శకుడు హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి చిత్రాలలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.


 కగా పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేస పనిలో ఉన్నారు. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా... జనవరి నుండి అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. కాగా ఏడాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాలు విడుదల కానున్నాయట. 

వకీల్ సాబ్ చిత్రంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మరియు క్రిష్ మూవీ 2022 జనవరిలో విడుదల కానుందట. 
అనగా ఏడాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాల విడుదల ఉంటుందని అంటున్నారు. పవన్ చివరి చిత్రం అజ్ఞాతవాసి విడుదలై మూడేళ్లు అవుతుండగా... ఫ్యాన్స్  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాల విడుదల అంటే సామాన్య మైన విషయం కాదు.