సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న రచ్చ ఏమిటీ అంటే పవన్ క్లీన్ షేవ్ ఉన్నాడు..దేని కోసం అని. ఆయన క్లీన్ షేవ్ తో కనిపించినా.. గడ్డంతో కనిపించినా..హాట్ టాపిక్కే. కొద్ది రోజుల క్రితం వరకూ రఫ్ లుక్ లో గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్   జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ మీటింగ్ సందర్బంగా క్లీన్ షేవ్ తో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇలా పవన్ క్లీన్ షేవ్ తో కనిపించడం వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. అందుతోన్న సమాచారం మేరకు ఆయన ఎలక్షన్ ప్రచారం కోసం ఇలా రెడీ అయ్యారని తెలుస్తోంది. అదే సమయంలో వకీల్ సాబ్ లో ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో కూడా ఇదే లుక్ లో కనబడబోతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ త్వరలో ఉదయ్ పూర్ కు ప్రయాణం కట్టనున్నారు. అక్కడేం పని అడక్కండి. మెగా డాటర్ నీహారిక వివాహం అక్కడ జరగనుంది. ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేకపోయిన పవన్ రెండు రోజులు ముందే ఉదయ్ పూర్ వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నీహారక తన బాబాయ్ దగ్గర మాట తీసుకుందని తెలుస్తోంది. నిశ్చితార్దం సమయంలో చాతుర్మాశ దీక్ష లో ఉండటంతో రాలేకపోయానని, అందుకే రెండు రోజులు ముందే వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని హామీ ఇచ్చారట. ఇక పవన్ అక్కడకు వెళ్లారంటే ఆ రచ్చ వేరే కదా.

ఇకగుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ, మెగాడాటర్‌ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం చేసుకోబోతున్నారు. డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని, ఆయన పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్‌ రావు దంపతులు పెళ్లి ముహూర్తం గురించిన వివరాలను తెలిపారు. అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి చేయబోతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.