పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ని పూజా కార్యక్రమాలతో షురూ చేశారు. జనవరి మొదటి వారంలో ఈ సినిమాని  సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. సాగర్‌ కె.చంద్ర దీనికి దర్శకత్వం వహించనుండగా, ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర పేరు తెరపైకి వచ్చింది. `బిల్లా రంగా` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. అయితే గతంలోనే ఈ టైటిల్‌ వినిపించింది. కాకపోతే అప్పుడు ఈ రీమేక్‌లో నటించే హీరోలెవరనేది కన్ఫమ్‌ కాలేదు. తాజాగా అన్ని సెట్‌ అయ్యాయి. దీంతో మరోసారి టైటిల్‌ కి సంబంధించిన చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌లో రకరకాల టైటిల్స్ సూచించారని తెలుస్తుంది. 

అయితే చిత్ర కథకి `బిల్లా రంగా` అనే టైటిల్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ స్వతహాగా ఈ టైటిల్‌ని సూచించారట. గతంలో చిరంజీవి, మోహన్‌బాబు హీరోగా ఇదే పేరుతో సినిమా వచ్చింది ఆకట్టుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్‌ ఈ పేరుని ఫైనల్‌ చేయమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌ బాధ్యతలు పవన్‌ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునే ఆలోచినలో ఉన్నారట.