పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` నుంచి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి రోజున సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిపారు.  

ఇందులో పవన్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవన్‌ కళ్యాణ్‌ పార్ట్ పూర్తయ్యింది. ఇటీవల న్యూ ఇయర్‌ సందర్భంగా బైక్‌పై పవన్‌, శృతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ డ్యూయెట్‌ పాడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని అభిమానులను అలరించారు. ఇక సంక్రాంతికి పెద్ద ట్రీట్ నే రెడీ
చేస్తున్నారు. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.