Asianet News TeluguAsianet News Telugu

ఇంజ‌నీరింగ్ బాబుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

  • ఇంజ‌నీరింగ్ బాబుగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
  • త్రివిక్రంతో 3వ సినిమా
  • హీరోయిన్స్‌గా కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయెల్
PAWAN KALYAN TRYING DIFFERENT TITLES

        
సినిమాలో స్టూడెంట్స్ హక్కుల గురించి చాలా విషయాలు ప్రస్థావించడమే కాదు ఓ రకంగా వారి సత్తా ఏంటో చూపించేదిగా సినిమా ఉంటుందట.  సినిమా టైటిల్ గా దేవుడే దిగి వచ్చినా టైటిల్ ప్రచారం లో ఉండగా ఇప్పుడు కొత్తగా ఇంజినీరింగ్ బాబు అంటూ టైటిల్ వినబడుతుంది.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. . కచ్చితంగా మరోసారి ఈ కాంబినేషన్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే సినిమా అవుతుందని వారి అంచనా.

        
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ తో పాటుగా అను ఇమ్మాన్యుయెల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తమిళ యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios