Asianet News TeluguAsianet News Telugu

పవన్, త్రివిక్రమ్ ల చిత్రానికి టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది

  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ
  • హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్న చినబాబు(రాధాకృష్ణ)
  • ఈ మూవీకి టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన టీమ్
pawan kalyan trivikram movie title confirmed

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ అంటేనే ఆ చిత్రానికి ఎంతటి హైప్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారీ హిట్ సినిమాల తర్వాత వీళ్ల కాంబినేషన్లో మరో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రం టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతోంది.

pawan kalyan trivikram movie title confirmed

 

ఇంజనీర్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడే దిగివచ్చినా ఇలా చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని రోజులుగా 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ కూడా జోరుగా ప్రచారం అవుతోంది. మరి వీటిలో ఏ టైటిల్ ఖరారవుతుందనేది తెలుసుకోవాలని పవర్ స్టార్ ఫ్సాన్స్ మాత్రమే కాక అంతా ఉత్సుకతతో వున్నారు. ఈ చిత్రానికి ఇలా పలు పేర్లు ప్రచారంలోకి రావడంతో కన్ఫ్యూజ్ అవుతున్న పవర్ స్టార్ అభిమానులకు డౌట్స్ క్లియర్ చేస్తూ.. సినిమా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ అజ్ఞాతవాసి టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ‘అజ్ఞాతవాసి' టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

pawan kalyan trivikram movie title confirmed

 

సాధారణంగా పవర్ స్టార్ సినిమా అంటేనే హైప్ ఓ రేంజిలో ఉంటుంది. దానికి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడైతే బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే. ఇప్పుడదే జరుగుతోంది.  తాజా సమాచారం ప్రకారం జెమినీ టీవీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ హక్కుల రూపంలోనే ఈచిత్రానికి ఇంత భారీ రేటు రావడం గమనార్హం. ఈ డబ్బుతో ఓ మీడియం రేంజి తెలుగు సినిమా తీయొచ్చని చర్చించుకుంటున్నారు.

pawan kalyan trivikram movie title confirmed

 

మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ నిపుణులు అంచనావేస్తున్నారు.

pawan kalyan trivikram movie title confirmed

ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2018 జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios