పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రం మేకింగ్‌కు సంబంధించిన రెండు వీడియోలను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో పవన్‌, త్రివిక్రమ్‌ ల తో పాటు యూనిట్‌ సభ్యులంతా..షూటింగ్ సమయంలో చాలా సరదాగా, సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఓ సన్నివేశంలో పవన్‌ నటన బాగా నచ్చిందని త్రివిక్రమ్‌ షూటింగ్‌ సమయంలో అన్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్‌ వీడియోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఓ లుక్కేయండి...