పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన చిత్రం “భీమ్లా నాయక్” కోసం తెలిసిందే. మళయాళంలో సూపర్ హిట్ అయ్యినటువంటి చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ మరియు రానా లతో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించి సాలిడ్ హిట్ కొట్టాడు.


పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్దాయిలో రీమేక్ లు మీద పడ్డారు. మొన్న భీమ్లానాయక్ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో మరిన్ని రీమేక్ లకు ఆయన సిద్దపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు.ఈ రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ కల్యాణ్ మ‌రో మూడు రీమేక్ సినిమాల‌ను లైన్ లో పెట్టినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

అందులో మొదటగా త‌మిళ్ లో విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా థేరీ చిత్రం రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్ లుగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. . ఈ మూవీని ఇప్పటికే తెలుగులో `పోలీసోడు` పేరుతో దిల్ రాజు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇదే చిత్రాన్ని త్వరలో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో నటించడానికి పవన్ కల్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో పవన్ ..పరర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు.

 ఈ రీమేక్ కి ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. `సాహో` తరువాత మరో చిత్రాన్ని చేయని సుజీత్ కు ఈ ఆఫర్ వచ్చినట్లు చెప్తున్నారు. గతంలో ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్‌ ప్లాన్ చేసారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు.

ఇక ఈ చిత్రంతో పాటు... ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్వ‌క‌త్వంలో వినోద‌య చిత్తం సినిమాని రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ త‌మిళ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.ఇక ఈ సినిమాను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేస్తూ పనులు పూర్తిగా త్రివిక్రమ్ కు అప్పగించినట్లు సమాచారం. అలాగే 2017లో మాధవ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో విక్ర‌మ్ వేద సినిమా వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాను ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు చెప్పుకుంటున్నారు.