మలయాళ సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే.  'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురూ కలిసి నిర్మిస్తారని సమాచారం.  పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'కింగ్ ఆఫ్‌ యాటిట్యూడ్'‌. .. తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మరోసారి రాబోతున్నారు అంటూ సినిమాను అనౌన్స్‌ చేశారు. 

ఇక ఈ సినిమా రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది.దాంతో పవన్‌తో పాటు రానా కూడా ఈ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో రానా నటించడం లేదని, మరో యాక్షన్ హీరో నటిస్తున్నాడని టాక్‌ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు గోపీచంద్. మలయాళంలో బిజూ మీనన్‌ చేసిన పాత్రను పవన్ తో, పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను గోపిచంద్ చేయనున్నారని వినిపిస్తుంది. 

ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తున్న గోపీచంద్..ప్రస్తుతం తన కెరీర్ లో డల్ ఫేజ్ లో ఉన్నాడు. దాంతో పవన్ తో ఈ సినిమాలో నటించటానికి వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.ఈ వార్తే కనుక నిజమైతే సిని అభిమానులకే పండగే మరి.  స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు.