Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందే... ఫ్యాన్స్ కోరిక అదే!

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు నితిన్ తన వివాహ ఇన్విటేషన్ అందచేసారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరు అవుతారని చెప్తున్నారు. గతంలో నితిన్ నటించిన చిత్రాల ఆడియో పంక్షన్స్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా పవన్ రాకతో తన వివాహం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నితిన్ నమ్ముతున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ మందికి నితిన్ శుభలేఖలు పంపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. 

Pawan Kalyan to Grace Nithins Wedding?!
Author
Hyderabad, First Published Jul 21, 2020, 8:39 AM IST

పవన్ కళ్యాణ్ తమ పెళ్లికి వస్తే బాగుంటుందనేది అభిమానుల ఆశ. అయితే అందరి అభిమానులకు ఆ ఆశ తీరదు. కానీ డై హార్డ్ ఫ్యాన్ అయిన నితిన్ లాంటి వాళ్లకు తీరే అవకాసం ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు నితిన్ తన వివాహ ఇన్విటేషన్ అందచేసారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరు అవుతారని చెప్తున్నారు. గతంలో నితిన్ నటించిన చిత్రాల ఆడియో పంక్షన్స్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా పవన్ రాకతో తన వివాహం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నితిన్ నమ్ముతున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ మందికి నితిన్ శుభలేఖలు పంపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. 

నితిన్ వివాహం ఈనెల 26 వ తేదీన జరగబోతున్న సంగతి తెలిసిందే.  తన స్నేహితురాలు షాలినిని నితిన్ వివాహం చేసుకోబోతున్నారు.  భీష్మా సినిమా రిలీజ్ తరువాత వీరి వివాహం జరగాల్సి ఉన్నది.  కానీ, లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది.  కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో నితిన్ వివాహం రెండుసార్లు వాయిదా వేసుకున్నారు.  అయితే, కరోనా నిబంధనలు ఇప్పట్లో సడలించేలా కనిపించడం లేదు.  

కరోనాతో సహజీవనం చేయక తప్పదని, కనీసం మరో ఏడాది పాటు కరోనా ప్రభావం ఉంటుందని ప్రభుత్వాలు చెప్తున్న సంగతి తెలిసిందే.  దీంతో హీరో నితిన్ కరోనా నిబంధనల ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఇన్విటేషన్స్ పంపిణీ మొదలెట్టారు. రీసెంట్ గా నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు.  తన వివాహానికి హాజరు కావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు హీరో నితిన్.    నితిన్ వివాహానికి కుటుంబసభ్యులతో పాటు అతికొద్ది మంది మాత్రమే హాజరవుతున్నారని సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios