ఇసుక,  ఎర్రచందనం తో అద్భుత రాజధాని కడతామన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఎందుకు పెట్టాం. పర్యావరణాన్ని నాశనం చేసేది వద్దని, ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి కోసం కోరుతుంటే.. అవన్నీ వదిలేసి ఒక్క ఆంధ్ర ప్రదేశ్.. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు.

 

ఇక అన్యాయంగా మహిళపై దాడి చేసి మహిళను 40 రోజులు జైల్లో పెట్టింది. అందుకేనా అధికారమిచ్చింది.. ఇదేనా మీరు చేసేది. మా రాజకీయ బాసుల వల్ల ఇష్టంలేకున్నా పనులు చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షి గారిని ఎందుకు కాపాడలేదు. మీ ఎమ్మెల్యేకి కొమ్ముకాస్తారా. సహనాన్ని పరీక్షించొద్దు. చాలా భయంకరమైన తీవ్ర పరిణామాలుంటాయి. మహిళా అధికారిణి మీద దాడి చేస్తే సర్దుకుపోవటం ఏంటండీ.. మహిళా అధికారులంతా భయపడుతున్నారు. ఎమ్మెల్యే కేమన్నా కొమ్ములున్నాయా..

 

సింగపూర్ తరహా రాజధాని కావాలంటే.. సింగపూర్ తరహా పాలన కావాలి. కీర్తి శేషులు లీక్వాన్ యూ.. స్నేహితున్ను కూడా అవినీతికి పాల్పడ్డందుకు జైల్లో పెట్టారు. అతని కేబినెట్ లో నానా రకాల మనుషులున్నా.. సింగపూర్ లో ఎవరుంటే వాళ్లంతా సింగపూరియన్స్ అని భావించేవారు. వనజాక్షి తరహా ఘటనలు సింగపూర్ లో జరిగితే అక్కడ ఎవ్వడైనా సరే.. తోలు వూడిపోయేలా కొట్టేవారు.