ప్రస్తుతం పొలిటికల్ టూర్ లో ఉన్నారు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, వారాహి విజయ యాత్రతో దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే ఆయన ఈయాత్రలో  సినిమాల టాపిక్ కూడా తీసుకువచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..? 

వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ లో హీటు పుట్టిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా వరకూ షూటింగ్స్ కంప్లీట్ చేసిన ఆయన.. ప్రస్తుతం పొలిటికల్ బిజీలో ఉన్నారు. ఈక్రమంలోనే సినిమాలు రాజకీయాల అంశంపై పవర్ స్టార్ చాలా ఆవేశంగామాట్లాడారు. ముమ్మడివరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవపడతారు ఎప్పుడూ అని. . సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే.. కాని సినిమాను రాజకీయం చేయెద్దన్నారు. మేమంతా కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం.. మరి మీరెందుకు ఇలా గొడవపడతారు అని ప్రశ్నించారు. అంతే కాదు..

 జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరు హీరోలు నాకు ఇష్టం. అందరం కలిసినప్పుడు పలకరించుకుంటూ.. బాగానే ఉంటాం.. అయితే మీ సినిమా ఇష్టాన్ని రాజకీయాల మీద చూపించకండి.... రాజకీయాలు వేరు.. మహేష్, ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు, నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్టార్స్, ....జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన వారు.. కాని నాకు ప్రపంచ వ్యాప్తంగా అంతగా తెలియకపోవచ్చు.. కాని నాకు ఈగో లేదు... సగటు మనిషి బావుండాలి అని కోరుకునే వ్యక్తిని నేను అన్నారు పవన్ కళ్యాణ్. 

అంతే కాదు సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు ఇష్టపడితే మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట ఒక్కసారి వినండి... పేద దళిత కుటుంబాలు బావుండాలి అనుకునే మనిషిని నేను, నీళ్ళు లేని వాడికి దాహం తీర్చాలి అనే మనస్తత్వం కలిగిన వాడిని... అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను,హీరోల ఫ్యాన్స్ కొట్టుకోకండి, మనందరం సమిష్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ కి అండగా ఉండండి... సమాజానికి పోరాటం చేసే వాడు కావాలి ఈ సమాజంలో.... అందరు హీరోల ఫ్యాన్స్ ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు పవన్. 

ఇక పవర్ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలతో పాటు.. ఇటు సినిమా వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది. చాలా మంది పవన్ వ్యాఖ్యలకు కామెంట్లు చేస్తున్నారు. మెగా ప్యాన్స్ తో పాటు.. పవన్ మాటలు నచ్చిన వారంతే.. ఆయన్ను సపోర్ట్ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.