అఫీషియల్ గా ఈ మేరకు ప్రకటన చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.  ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ారు. గోపాల గోపాల తర్వాత పవన్ దేవుడుగా కనిపిస్తున్న చిత్రం ఇదే.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...తమిళ దర్శకుడు ,నటుడు సముద్రఖని డైరక్షన్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. మామా అల్లుళ్ల క‌ల‌యిక‌లో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వినోదయసిత్తం ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్ పై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కన్ఫామ్ చేసారని టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది. కానీ ఈ టైటిల్ వద్దనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ఓ టైటిల్ కన్ఫర్మ్ చేయబోతున్నారని సమాచారం. అదేమిటంటే..

#Bro టైటిల్ ని ఈ సినిమాకు ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్..పవన్ ని "Bro" అని పిలుస్తూంటాడు. దాంతో ఆ టైటిల్ ని ఫిక్స్ చేసారంటున్నాడు. అయితే ఈ టైటిల్ కు మాత్రం పవన్ ఫ్యాన్స్ ఓటేయటం లేదు. ఇలాంటి టైటిల్ పెట్టడం ఏమిటి..వేరేది పెట్టండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం ఈ సోషల్ మీడియా యుగంలో జనం నోట్లో నానిన పదం కాబట్టి ఈ టైటిల్ పెట్టడం సమంజసం అంటున్నారు. 

ఈ చిత్రం #PKSDT కోసం ఇప్పటికే మూడు టైటిల్స్ ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. టైటిల్ ని వచ్చే వారం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీకి కింగ్ నాగార్జున సూపర్ హిట్ సాంగ్ టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ మూవీకి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఒక సామాన్యుడి కోసం దేవుడు దిగివస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. మరో ప్రక్క కాలుడు అనే టైటిల్ ని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉందిని వార్తలువచ్చాయి. కానీ అదికాదు అని తేలిపోయింది. 

మరో ప్రక్క ఆగస్ట్ 15 లేదా ఆగస్ట్ 25 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ సెట్ చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. అయితే అఫీషియల్ గా ఈ మేరకు ప్రకటన చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ారు. గోపాల గోపాల తర్వాత పవన్ దేవుడుగా కనిపిస్తున్న చిత్రం ఇదే. 

ఈ ఫాంట‌సీ డ్రామా సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుకోకుండా ప్ర‌మాదంలో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ఈ రీమేక్ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రీమేక్‌కు దేవ‌ర‌, దేవుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌ల‌తో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాష‌ణ‌ల‌ను అందించ‌బోతున్నారు. 

 ఒరిజినల్ వెర్షన్‌లో ఎలాంటి పాటలు లేవు కానీ తెలుగు స్క్రిప్ట్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసేలా ఓ మాస్ మసాలా నెంబర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. తెలుగు వర్షన్ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. మాటలు అందిస్తూ తెర వెనుక అన్నీ తానై చూసుకోబోతున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్