పవన్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త
దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్ .. క్రిష్, హరీశ్ శంకర్‌తోపాటు సాగర్ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు.
గత కొద్ది నెలలు గా పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నా పబ్లిక్ లోకి రాలేదు. అయితే ఆయన తన షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయటంతో నిర్మాతలు షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ సైతం సాగర్ చంద్ర సినిమా షూట్ మొదలెట్టమని చెప్పారట. ఈ సినిమా మేజర్ పార్ట్ షూట్ హైదరాబాద్ అల్యూమినియం పాక్టరీలో జరిగింది. అక్కడ వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేసారు. ఇప్పుడు అక్కడ తిరిగి కంటిన్యూ చేయబోతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ సెట్ లో సీన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. జూలై రెండవ వారం నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి ఈ భారీ మల్టీస్టారర్‌లో కలిసి నటిస్తున్నారు. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్ .. క్రిష్, హరీశ్ శంకర్‌తోపాటు సాగర్ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు. ఈ నేపధ్యంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ని త్వరగా పూర్తి చేయబోతున్నారు.
సితార ఎంటర్ టైన్‌మెంట్స్‌పై, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ఎస్ సంగీతం అందిస్తున్నారు. తమన్ బీజీఎం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్ కాంబో అంటూ అటు పవన్, ఇటు రానా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.