పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలంటే పవర్ ఫుల్ టైటిల్స్ తో ఉంటాయి. పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు ఉంటాయి. అటు ఫ్యాన్స్ కూడా ఆయన కొత్త సినిమా టైటిల్స్ ఎప్పుడు చెపుతాడా అని ఎదురుచూస్తుంటారు. అటువంటిది ఈసారి పవన్ రీమేక్ టైటిల్ గురించి పెద్ద చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వరుసగా రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒకవైపు మనకు రీమేక్ ల రిస్క్ వద్దు అంటూ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్న టైమ్ లో మరో రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవర్ స్టార్ . అంతే కాదు ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు మెగా మేనల్లుడు. ఇందులో మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా నటించనున్నారు.
ఇక ఎప్పటిలాగానే ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేసే బాధ్యత తీసుకోగా.. తమిళ్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో ఓ పాత్ర కూడా చేస్తున్నారు.
ఆగస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే రిలీజ్ కు మాత్రం చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో పవన్ రీమేక్ సినిమానికి జగత్ జజ్జరికా అని టైటిల్ ను ఖరారు చేసారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ రేంజ్ కు రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసావంటూ ఇప్పటికే అభిమానులు త్రివిక్రమ్ పై నెట్టింట ఫైర్ అవుతుండగా.. ఇప్పుడు అలాంటి అసంబద్ధమైన టైటిల్ పెట్టారంటూ మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ ఇప్పుడు ఉన్న సినిమాలే కంప్లీట్ చేయడం లేదు. అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేయలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పూర్తి కావల్సిన హరిహర వీరమల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హీరీష్ శంకర్ సినిమా ఏమైందో ఊసే లేదు. మరో రెండు ప్రాజెక్ట్ లు ఇంకా సెట్స్ ఎక్కలేదు. ఇక ఇప్పుడు కొత్త సినిమాల పరిస్థితి ఏంటీ... అసలు అవి కంప్లీట్ చేసే టైమ్ ఉంటుందా అని అతంతా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఏపీలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగితే. ఉన్న సినిమాలు కూడా అలా పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.
