పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న `పీకేఎస్‌డీటీ` మూవీ కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. టైటిల్‌కి సస్పెన్స్ తెరదీసే టైమ్‌ వచ్చింది. టైటిల్‌, ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేశారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. సమద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ స్క్రిప్ట్ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంది. అనేక రకాల పేర్లు తెరపైకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. `దేవర`, `బ్రో` అనే టైటిల్స్ ప్రధానంగా వినిపించాయి. 

ఇందులో `దేవర` ఎన్టీఆర్‌30 చిత్రానికి నిర్ణయించారట. ఇక ఇప్పుడు `బ్రో` అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ టైటిల్‌ సస్పెన్స్ కి తెరపడింది. టైటిల్‌ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేశారు. రేపు(మే18) సాయంత్రం నాలుగు గంటల 14 నిమిషాలకు `పీకేఎస్‌డీటీ) సినిమా టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. 

ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ని కూడా కన్ఫమ్‌ చేశారు. జులై 28న రాబోతున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా షురు అయినట్టే అని తెలుస్తుంది. ఈ వార్తతో పవన్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అప్పుడే సంబరాలు స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్‌. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ఆయనే దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మొదటిసారి పవన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్నారు. 

Scroll to load tweet…

తెలుగులో గతంలో వచ్చిన `గోపాల గోపాల` తరహాలోనే దేవుడి, మనిషి మధ్య సాగే కథ. ఇందులో దేవుడిగా పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తాడట. దీంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. పవన్‌ కళ్యాణ్‌ చివరగా `భీమ్లా నాయక్‌` చిత్రంతో మెరిశారు. గతేడాది ఫిబ్రవరిలో ఇది రిలీజ్‌ అయ్యింది. దాదాపు ఏడాది తర్వాత మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఇకపై వరుసగా ఆయన వెండితెరపై రచ్చ చేయబోతున్నారు. మిగిలిన రెండు సినిమాలు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ` చిత్రాలు కూడా మరో ఆరు నెలల గ్యాప్‌తో విడుదల కాబోతున్నాయి.