పవన్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేలా ఉంది. యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తున్న పవన్ హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపిస్తున్నారు. హరి హర వీరమల్లు ప్రాక్టీస్ సెషన్ కి చెందిన ఒక స్టిల్ వైరల్ అవుతుంది.  

ఫ్యాన్స్ కి పవన్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఇంకా చిత్రీకరణ మొదలుకాలేదు. కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. దీంతో వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. గత రెండు వారాలుగా హరి హర వీరమల్లు వర్క్ షాప్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ వర్క్ షాప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక భీకర యాక్షన్ సన్నివేశాలకు పవన్ కళ్యాణ్ సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో హూడీ జాకెట్ ధరించిన పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వర్క్ షాప్ కి సంబంధించిన పవన్ పిక్ చిత్ర యూనిట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. పవన్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ అభిమానుల్లో ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే ఆయన కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం ఇది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు... మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్... హరి హర వీరమల్లు షూటింగ్ డిలే చేశారు. నిర్మాతల ఒత్తిడి నేపథ్యంలో అక్టోబర్ 5న ప్రారంభం కావాల్సిన బస్సు యాత్ర పక్కన పెట్టి హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేస్తున్నారు. ఆయన సైన్ చేసిన చిత్రాల జాబితాలో వినోదయా సిత్తం రీమేక్ కూడా ఉంది. ఇంత వరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. 

సాయి ధరమ్ తో పవన్ మల్టీస్టారర్ గా వినోదయ సిత్తం చేస్తున్నారు. వినోదయా సైతం కొరకు పవన్ కేవలం 25 నుండి 30 డేట్స్ మాత్రమే ఇచ్చారట. కాబట్టి వినోదయా సిత్తం కూడా పవన్ పూర్తి చేసే సూచనలు కలవు. ఇక హరి హర వీరమల్లు వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే ఆస్కారం కలదు.