టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).... ఇండియాన్ మెగాస్టార్ అమితాబచ్చన్(Amitabh). ఈ ఇద్దరు కలిస్తే...? అదిపక్కాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అమితాబ్ ను పవర్ స్టార్ ఎందుకు కలిసినట్టు..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).... ఇండియాన్ మెగాస్టార్ అమితాబచ్చన్(Amitabh). ఈ ఇద్దరు కలిస్తే...? అదిపక్కాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అమితాబ్ ను పవర్ స్టార్ ఎందుకు కలిసినట్టు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan).. బిగ్ బీ అమితాబ్(Amitabh) ను కలిశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో.. పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బాగంగా అమితాబ్ తో హైదరాబాడ్ వచ్చారు. అయితే అక్కడే షూటింగ్ చేసుకుంటున్న పవర్ స్టార్ అమితాబ్ దగ్గరకు వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్.. పాలిటిక్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్(Pawan Kalyan). సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో బీమ్లానాయక్ షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవర్ స్టార్.. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్నాడు.

అటు అమితాబచ్చన్ Amitabh... వయస్సు పెరుగుతున్నా కొద్ది ఇంకా హుషారుగా సినిమాలు చేస్తున్నారు. హిందీతో పాటు సౌత్ లో కూడా అమితాబ్ సినిమాలు చేస్తున్నారు. నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో ప్రభాస్ , దీపికా పదుకొనే జంటగా నటిస్తోన్న ప్రాజెక్ట్ కేలో అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.