మహేష్ బాబు -పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించని కాంబినేషన్లు ఎన్నో సందడి చేశాయి. అభిమానులను అలరించాయి. ఔరా అనిపించాయి. అయితే ఇప్పటికే కొన్ని కాంబోలపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో మిరికొన్ని కాంబినేషన్లు మిస్ అయినవి కూడా ఉన్నాయి.తాజాగా మహేష్ - పవన్ కళ్యాణ్ కు సంబంధిచిన ఓ న్యూస్ వైరల్అవుతోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించని కాంబినేషన్లు ఎన్నో సందడి చేశాయి. అభిమానులను అలరించాయి. ఔరా అనిపించాయి. అయితే ఇప్పటికే కొన్ని కాంబోలపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో మిరికొన్ని కాంబినేషన్లు మిస్ అయినవి కూడా ఉన్నాయి.తాజాగా మహేష్ - పవన్ కళ్యాణ్ కు సంబంధిచిన ఓ న్యూస్ వైరల్అవుతోంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఇండస్ట్రీలోనే అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయ్యేది.. టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యేది. అటు మెగా అభిమానులకు .. ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ వచ్చేది. కానీ ఇప్పటివరకు వీరు కలిసి నటించలేదు. నిజానికి ఎప్పుడో వీరి కాంబోలో సినిమా ఎప్పటి నుంచో డిమాండ్ లో ఉంది. అంతే కాదు.. సినిమాదాదాపు ఫైనల్అవుతుంది అనుకున్న స్టేజ్ లోనే.. ఈకాంబో బ్కేక్ అయ్యి.. పవర్ స్టార్ ప్లేస్ లోకి మరో హీరో వచ్చాడట.
ఇంతకీ ఆ సినిమా ఏంటో అందరికి ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. ఆసినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. భారీగా వసూళ్లు రాబట్టింది. అవన్నీ పక్కన పెడితే.. ఫ్యామిలీ ఆడియన్స్ కు మర్చిపోలేని అనుభూతిని అందించింది. మధ్యతరగతి అనుభందాలను అద్దంపట్టేలా తెరెక్కిన ఈసినిమా... మంచి విజయం సాధించింది. ఇంతకీ పవన్, మహేష్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా .. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
ఈసినిమా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కింది. ఎప్పుడో 2013లో రిలీజ్ అయన ఈసినిమాను ఇంతక కాలం తరువాత కూడా ఆడియన్స్ అభిమానిస్తున్నారు.. ప్రేమిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ల తరువాత..మరుగున పడిపోయిన.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ పునాదులు వేసింది ఈసినిమానే. ఇందులో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ నిజానికి ఇందులో పవన్ నటించాల్సి ఉందట. ఈ విషయాన్ని గతంలో డైరెక్టర్ శ్రీకాంత వెల్లడించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పెద్దోడు, చిన్నోడి పాత్రల కోసం ముందుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను అనుకున్నారట. కానీ ఎందుకు ఈ కాంబో సెట్ అవ్వలేదు. ఏవో కారణాల వల్ల పవర్ స్టార్ ఈప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టలేదు. దాంతో డైరెక్టర్ అనుకున్న కాంబినేషన్స్ మారిపోయాయని.. దీంతో పెద్దోడి పాత్రలో వెంకటేష్.. చిన్నోడి పాత్రలో మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అవ్వడమే కాదు..సెన్సేషన్ కూడా అయ్యింది.