ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ప్రాణస్నేహితులు కన్నా మిన్నగా ఉంటారు. ఇద్దరికీ కామన్ గా ఉండే ఒక క్వాలిటీ పుస్తకాలు చదవడం.
ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను, త్రివిక్రమ్ గారు అన్ని విషయాలని ఒకే కోణంలో చూస్తాం. మేమిద్దరం పుస్తకాల పురుగులమే. కానీ అప్పుడప్పుడూ ఆ పుస్తకాల విషయంలోనే తేడాలు వస్తుంటాయి.
నా దగ్గర ఉన్న పుస్తకాలలో ఏదైనా ఒకటి నచ్చి త్రివిక్రమ్ అడిగితే నేను ఇవ్వను. నాకు పుస్తకాలు ఇవ్వాలని అనిపించదు. అవసరం అయితే సినిమా అయినా ఫ్రీగా చేస్తా.. ఆ పుస్తకం మాత్రం ఇవ్వను అని సరదాగా చెబుతుంటాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలు వచ్చాయి. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ్ లో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
