పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలా రోజులైంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండటంతో సినిమా మీద కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను 2018 జనవరి 10న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ఫోటో ఇప్పటివరకు బయటికి రాకపోవడం విశేషం. అభిమానుల ఒత్తిడితో ఓ మ్యూజికల్ టీజర్ ను మాత్రమే  చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కర్ణాటకలోని మంగుళూరు ఏరియాలో జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో పవర్‌ స్టార్‌ ఎడమ చేతికి గాయమైందని సమాచారం. ప్రస్తుతం పవన్‌ చేతికి గాయమైన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తరువాత పవన్‌ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ వచ్చిందనే ఆనందం కన్నా... పవన్‌ చేతికి గాయం అవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.