నటుడుగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేంతగా ఎదిగారు బండ్ల గణేష్. రాజకీయాలలో కూడా తన అదృష్టం పరీక్షించుకున్న బండ్ల వ్యాఖ్యలు వింతగా ఉంటాయి. ఆయన సీరియస్ గా మాట్లాడిన సిల్లీగా తోస్తుంది. పవన్ భక్తుడిని అని చెప్పుకొనే బండ్ల గణేష్ ఆయనతో రెండు సినిమాలు చేశారు. ఒకటి తీన్ మార్ కాగా మరొకటి గబ్బర్ సింగ్. తీన్ మార్ పవన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. గబ్బర్ సింగ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. పవన్ ని పరాజయాల పరంపర నుండి బయటపడేసిన సినిమాగా గబ్బర్ సింగ్ నిలిచింది. 

దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించారు. హిందీ హిట్ మూవీ దబంగ్ కి తెలుగు రీమేక్ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టింది. ఒరిజినల్ ని ఫాలో కాకుండా హరీష్ స్ట్రైట్ ఫిల్మ్ వలె గబ్బర్ సింగ్ ని తీర్చిదిద్దారు. హరీష్ ఈ చిత్ర విజయం తరువాత స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటన మరియు గ్లామర్ కూడా సినిమా విజయానికి దోహదం చేశాయి. 

ఐతే గబ్బర్ సింగ్ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ని బండ్ల గణేష్ వద్దనుకున్నారట. ఇదే విషయం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో చెప్పారట. దానికి పవన్ ఆమెను ఎందుకు వద్దంటున్నావ్ అని అడిగారట. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి అందుకే వేరే హీరోయిన్ ని తీసుకుందాం అన్నారట. దానికి పవన్ నువ్వు మాత్రం అన్ని సూపర్ హిట్లే తీశావా, జయాపజయాలను బట్టి మనుషుల్ని అంచనా వేయకుడకు శృతి హాసన్ ని ఫైనల్ చేయి అన్నారట. ఆ సంఘటన తరువాత పవన్ పై బండ్లకు మరింత గౌరవం పెరిగిందట. అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న బండ్ల గణేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు.