Asianet News TeluguAsianet News Telugu

జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా రంగంలోకి రేణు దేశాయ్.. నిజమెంత..?

రేణు దేశాయ్ జనసేన కోసం రంగంలోకి దిగబోతున్నారా..? పవర్ స్టార్ కుసపోర్ట్ గా.. విమర్షిస్తున్న వారి నోర్లు మూయించబోతున్నారా..? ఈ విషయంలో ఆమె కామెంట్స్ ఏంటీ..? ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటీ..? 
 

Pawan Kalyan Ex Wife Renu Desai Support For Janasena JMS
Author
First Published Oct 19, 2023, 12:17 PM IST

తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె  నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. రేపు ( అక్టోబర్ 20) ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. సువర్టుపురం గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ మూవీగా రూపొందిన  ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ్ టైటిల్ రోల్ చేయగా.. నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈసినిమాలో రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రకు ఈసినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈక్రమంలో రేణు దేశాయ్ కు సబంధించిన ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. ఆమె జనసేనకు సపోర్ట్ గా రంగంలోకి దిగబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. ఆమధ్య పవర్ స్టార్ ను మూడు పెళ్ళిళ్లు అంటూ విమర్షించిన జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రేణు. ఇంట్లో ఆడవారి గురించి మీకెందుకు.. రాజకీయంగా ఫేస్ చేయండి అన్నట్టుగా మాట్టాడి.. పవర్ స్టార్ కు అండగా నిలబడింది. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. రేణు దేశాయ్ జనసేన తరపున రంగంలోకి దిగబోతున్నారంటూ సంతోషపడ్డారు. 

ఇక తాజాగా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు రేణు. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తుంది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఈ ప్రశ్న ఎదురయ్యింది. దాంతో ఈ విషయంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారా’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. “నాకు అనిపించింది నేను చెప్పాను. అంతేగాని ఒకరికి సపోర్ట్ చేయాలని కాదు. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.

అంతే కాదు ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోయి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. తనకి అనిపించింది, తన కరెక్ట్ అని నమ్మింది మాత్రమే మాట్లాడుతూ వచ్చినట్లు చెప్పుకొచ్చింది. కాగా గతంలో రేణూదేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ దగ్గర డబ్బులు తీసుకోని పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేసిందని విమర్శలు వినిపించాయి. అయితే ఆ ఛానల్ తో ఆమె కేవలం రైతులు కోసమే పని చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేతప్ప ఆ ఛానల్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని రేణూదేశాయ్ తెలియజేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios