కొడుకు అకీరాను చూసి గర్వంగా ఫీలవుతుంది రేణు దేశాయ్. అకీరా వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేసిన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

నటి రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ టీనేజ్ లో ఉన్నాడు. తన అభిరుచి మేరకు కళలు నేర్చుకుంటున్నాడు. అకీరాకు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉంది. చిన్న వయసులోనే ఓ షార్ట్ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను నట వారసుడిగా భావిస్తారు. హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశ పడుతున్నారు. అకీరా పవన్ కళ్యాణ్ కొడుకు అంటే రేణు దేశాయ్ ఊరుకోరు. ఆమెకు కోపం నషాళానికి తాకుతుంది. 

అకీరా నా కొడుకు మాత్రమే అంటుంది. ఇటీవల ఈ విషయమై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఆమెకు సోషల్ మీడియా వార్ నడిచింది. పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక రేణు వద్దే ఇద్దరు పిల్లలు పెరిగారు. తన కష్టార్జితంతో పిల్లలను పెంచి పెద్ద చేశానని రేణు దేశాయ్ అంటారు. ఏది ఏమైనా అకీరా, ఆద్యలు పవన్ కళ్యాణ్ పిల్లలు అని ఎవరైనా అంటే ఆమె ఆమెకు కోపం వస్తుంది. 

ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్ తో పాటు ఆర్ట్స్ నేర్పించారు. రేపు వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ లో ప్రోత్సహిస్తానని రేణు అంటున్నారు. ప్రస్తుతం అకీరా టీనేజ్ లో ఉన్నాడు. ఈ ఆరున్నర అడుగుల యంగ్ ఫెలోకి మంచి ఫాలోయింగ్ ఉంది. అకీరా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోకి ఆసక్తికర కామెంట్ కూడా పెట్టారు. అకీరా జిమ్ చేస్తూ తెలుగు, హిందీ మ్యూజిక్ వింటున్నాడు. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఆ అర్థం పర్థం లేని లౌడ్ ఇంగ్లీష్ మ్యూజిక్ కాకుండా సొంత భాషల మ్యూజిక్ వినడం గొప్ప విషయం... అంటూ కామెంట్ చేశారు. 

View post on Instagram

నేను కూడా జిమ్ లో హిందీ సాంగ్స్ వింటాను. హిందీ సాంగ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తాను. కొందరు నన్ను చదువు సంధ్య లేని దాని వలె చూస్తారు. మన మ్యూజిక్ వినడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఆ ఇంగ్లీష్ మ్యూజిక్ నాకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక అకీరా లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. కాగా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆమె కీలక రోల్ చేస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల కానుంది.