పవన్‌ కళ్యాణ్‌ బుల్లెట్‌పై ఎంట్రీ ఇచ్చారు. సుధా లాడ్జ్ లోకి ఎంటర్‌ అయ్యాడు. ఎంట్రీతోనే అదరగొట్టేశారు. తాజాగా ఈ సన్నివేశం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ షూట్‌ జరిగింది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇది సోమవారం ప్రారంభమైంది. యాక్షన్‌ సీన్‌తో షూటింగ్‌ ప్రారంభించినట్టు చిత్ర బృందం తెలిపింది. తాజాగా సినిమా షూటింగ్‌కి సంబంధించిన వీడియోని విడుదల చేశారు. అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్‌ అవుతుంది. 

ఇందులో సెట్‌లో షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్‌, నిర్మాత నాగవంశీ, మరో నిర్మాత రాధాకృష్ణ షూటింగ్‌ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో బెంజ్‌ కారులో పవర్‌ స్టార్‌ పవన్‌ దిగారు. త్రివిక్రమ్‌ని కలిసి మాట్లాడుకుంటూ వెళ్లడం, ఈ క్రమంలో ఆయన బుల్లెట్ ప్రత్యేకంగా చూడటం, అనంతరం, బుల్లెట్‌పై వెళ్లే సీన్‌ ఆద్యంతం గుస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. 

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ `వకీల్‌సాబ్‌`షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. దీంతో ఆ వెంటనే `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ షూట్‌ని ప్రారంభించారు. దీనికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు.  `ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటుండగా, ఆయనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. ఇందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొంటున్నారు. పది రోజలపాటు హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుపనున్నట్టు` నిర్మాత నాగవంశీ తెలిపారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభానికి న్యూస్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. పవన్‌ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. ఇండియా వైడ్‌గా ఇది ట్రెండింగ్‌ అవ్వడం విశేషం.