పవన్ కళ్యాణ్ మరో సినిమాని షూరు చేశారు. `ఓజీ` సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నేటి నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఆల్ రెడీ సాయిధరమ్‌తేజ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ముగిసింది. `హరిహర వీరమల్లు` షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఆగుతుందో పెద్ద సస్పెన్స్. ఇక హరీష్ శంకర్ తో చేస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడు సుజీత్‌తో చేస్తున్న సినిమాని స్టార్ట్ చేస్తున్నారు పవన్. `ఓజీ`(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పేరుతో సుజీత్ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ ఈనెల 15న ప్రారంభమైంది. ఈ మేరకు మరో అప్‌డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. సినిమా షూటింగ్‌లోకి నేడు(మంగళవారం) పవన్ కళ్యాణ్ అడుగుపెట్టినట్టు తెలిపారు. ఈ మేరకు సెట్‌లో ఫోటోలను విడుదల చేసింది.
`ఏప్రిల్ 15 నుంచి 'ఓజీ' చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ఉదయం మేకర్స్ ఒక ఫోటోను వదిలారు. అందులో బ్లాక్ హూడీ ధరించి, కళ్లద్దాలతో పవన్ కళ్యాణ్ చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ లో ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో నెలాఖరు వరకు చిత్రీకరణ జరగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు` అని టీమ్ తెలిపింది.
ముంబయిలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఇటీవల దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ సెట్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి అవాంతరాలు రాకుండా, టైమ్ వేస్ట్ కాకుండా ఆయనతో ఎంత మేరకు షూటింగ్ చేయోచ్చు, ఉన్న సమయంలో ఎంత ఎక్కువ సీన్లు తీయోచ్చు అనేదానిపై దర్శకుడు సుజీత్ అండ్ టీమ్ ఇటీవల టెస్ట్ షూట్ చేసింది. దీనికి ఏకంగా కోటి రూపాయలు అయ్యిందట. ఈ టెస్ట్ షూట్‌లో సుజీత్‌కి ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం.
ఈ సినిమా చాలా వరకు ముంబయిలో సాగుతుందని సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా సాగే కథ కావడంతో మాఫియా వంటి అంశాలకు ముంబయి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. అందుకే ఈ చిత్రానికి ముంబయి లొకేషన్ ఎంచుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కి హీరోయిన్ ఉండదని, ఆయనపై పాటలు ఉండవని తెలుస్తుంది. కేవలం టాకీ పార్ట్ లోనే పవన్ కనిపిస్తారట. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేయబోతుందనే మరో వార్త వినిపించింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం పవన్ 35-40డేస్ ఖాల్షీట్లు ఇచ్చారట. ఆ లోపు తన పార్ట్ ని షూట్ చేయాలనుకుంటున్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట. అందులో ఓ పార్ట్ ని ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగం క్లైమాక్స్ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని, రెండో పార్ట్ పై ఆసక్తిని పెంచేలా చేస్తుందని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
సంగీతం: ఎస్ థమన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన, దర్శకత్వం: సుజీత్
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
