పవన్‌ కళ్యాణ్‌ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని ఓపెన్‌ చేశారు. ఆయనకు నేడు బ్లూ టిక్‌ వచ్చింది. దీంతో ఆయన అకౌంట్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. రికార్డ్‌ఫాలోవర్స్ చేరిపోవడం విశేషం.

పవన్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పటి వరకు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ట్విట్టర్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. రెగ్యూలర్‌గా ఆయన రాజకీయ ట్వీట్లు చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు పవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఇన్‌స్టాలోకి వచ్చారు. గత నెలలో ఆయన అకౌంట్‌ని ఓపెన్‌ చేయగా నేడు బ్లూటిక్‌ వచ్చింది. దీంతో అధికారికంగా ప్రకటించారు. ఇక పవన్‌ అకౌంట్‌ అఫీషియల్‌గా గుర్తించడంతో అభిమానులు, ఫాలోవర్స్ తాకిడి పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ చేరిపోవడం విశేషం. మరే హీరోకి ఇది సాధ్యం కాలేదనే చెప్పాలి. పవన్‌ అంటే యూత్‌లో ఓ క్రేజ్‌ ఉంటుంది. ఆయన పేరు చెబితే అభిమానులు ఊగిపోతుంటారు. ట్విట్టర్‌లో తన పదునైనా కామెంట్లతో, పోస్ట్ లతో రచ్చ చేస్తుంటారు పవన్‌. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చారు. దీంతో ఇక వ్యక్తిగత విషయాలను ఇందులో తెలుసుకునే అవకాశం కల్పించారు. 

చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్‌ని పర్సనల్‌ విషయాలకే వాడుతుంటారు. ఫ్యామిలీ, సినిమాలు, పర్సనల్‌ ఫోటోలు, వీడియోలు పంచుకుంటారు. రీల్స్ చేస్తుంటారు. అయితే పవన్‌ ఆ టైమ్‌ కాదు, మరి ఆయన ఎలాంటి పోస్ట్ లు పెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన సినిమాల గురించి పెడతారా? ఎప్పటిలాగే తన రాజకీయ పోస్ట్ లు పెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. మొదటి పోస్ట్ ఏం ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ప్రొఫైల్‌లో మాత్రం `ఎలుగెత్తు, ఎదురించి, ఎన్నుకో జై హింద్‌`అనే నినాదాన్ని పంచుకున్నారు. 

టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉంది. సోషల్‌ మీడియాకి దూరంగా ఉండే ప్రభాస్‌ కూడా ఇన్‌స్టా అకౌంట్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు. ఇప్పుడు పవన్‌ కూడా రావడంతో పవన్‌ అభిమానుల్లో ఆనందం వెళ్లువిరుస్తుంది. వారంతా ఫుల్‌ ఖుషి అవుతున్నారు. ఇక పవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు, ఇక ఎవరినీ కూడా ఫాలో అవడం లేదు. ఆయన ఎవరిని ఫాలో అవుతారు, మొదటి పోస్ట్ ఏం ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పవన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ని ఓ ప్లానింగ్‌ ప్రకారం వాడబోతున్నారట. అది సంచలనాలకు తెరలేపేలా ఉండబోతుందని తెలుస్తుంది. మొదటగా ఆయన ఓ వీడియోని షేర్‌ చేయబోతున్నారని సమాచారం. 

ఇక తెలుగు హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా.. అల్లు అర్జున్‌ నిలిచారు. ఆయన్ని ఏకంగా 21.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండకి అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు.ఆయన్ని 18.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో రామ్‌చరణ్‌ ఉన్నారు. ఆయనకు 16 మిలియన్స్‌ ఫాలోవర్స్ ఉండగా, మహేష్‌కి 10.8 మిలియన్స్ ఫాలోవర్స్, ప్రభాస్‌ని 9.7మిలియన్స్ ఫాలోవర్స్, ఎన్టీఆర్‌ని 6.4మిలియన్స్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. మిగిలిన హీరోలు వీరి తర్వాతనే అని చెప్పొచ్చు.