Asianet News TeluguAsianet News Telugu

ఓజీకి మరో 15 రోజులే... సుజీత్ కి పవన్ కళ్యాణ్ డెడ్ లైన్!

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇది పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ కి డెడ్ లైన్ పెట్టాడట. 

pawan kalyan dead line to og movie director sujeeth ksr
Author
First Published Feb 28, 2024, 12:03 PM IST | Last Updated Feb 28, 2024, 12:03 PM IST

పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీ. 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఏపీలో టీడీపీతో కలిసి ఆయన పోటీ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించడం జరిగింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జన సైనికులే పవన్ కళ్యాణ్ ని దూషించే పరిస్థితి ఉంది. 

ఆ విషయం అలా ఉంచితే... పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. ఓజీ చిత్రీకరణ దాదాపు యాభై శాతం పూర్తి అయినట్లు సమాచారం. ఇటీవల విడుదల తేదీ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్ మిలిగిన ఓజీ షూటింగ్ కి 15 రోజులు కేటాయించారట. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ రెండు వారాల కాల్ షీట్స్ లో ఆయన పార్ట్ పూర్తి చేసుకోవాలని చెప్పారట. 

ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇది దర్శకుడు సుజీత్ కి ఛాలెంజ్ అని చెప్పాలి. ఇంతటి భారీ చిత్రాన్ని సుజీత్ పవన్ డెడ్ లైన్ ప్రకారం ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

పవన్ పూర్తి చేయాల్సిన మరో భారీ ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో రీమేక్స్ చేయడం కారణంగా హరి హర వీరమల్లు ఆలస్యం అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే హరి హర వీరమల్లు 2025 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కలదట. ఇక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కి పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios