పవన్‌ కళ్యాణ్‌ తాజాగా తన ట్విట్టర్‌ కామన్‌ డీపీ మార్చారు. జనసేన జెండా బ్యాక్‌ డ్రాప్‌లో నిల్చొని కోపం, ఆవేశం మేళవింపుగా ఉన్న ఫోటోని ట్విట్టర్‌ డీపీగా పెట్టుకున్నారు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటేనే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కి మారుపేరు. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న స్టార్‌ హీరో పవన్‌. ఆయన కనిపిస్తేనే అభిమానులు ఊగిపోతుంటారు. ఆయన బయటకొస్తే అభిమానులకు పండగే. రోడ్లన్నీ కిక్కిరిపోతుంటాయి. ఆయన్ని చూసేందుకు వేలాదిగా తరలి వస్తుంటారు. ఆయన చేసే ప్రతి మూవ్‌మెంట్‌ సంచలనంగా, హాట్‌ టాపిక్‌గా మారుతుంటుంది. అది వైరల్‌ అవుతుంది. ఆయన అభిమానులు ఆ స్థాయిలో రచ్చ చేస్తుంటారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ట్విట్టర్‌లో రచ్చ చేశారు. 

Scroll to load tweet…

పవన్‌ కళ్యాణ్‌ తాజాగా తన ట్విట్టర్‌ కామన్‌ డీపీ మార్చారు. జనసేన జెండా బ్యాక్‌ డ్రాప్‌లో నిల్చొని కోపం, ఆవేశం మేళవింపుగా ఉన్న ఫోటోని ట్విట్టర్‌ డీపీగా పెట్టుకున్నారు. ఇందులో పవన్‌ లుక్ అదిరిపోయేలా ఉంది. అది ఫ్యాన్స్ ని బాగా కట్టిపడేస్తుంది. దీంతో అభిమానులు రెచ్చిపోయారు. ఆ ఫోటోని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇండియా వైడ్‌గా పవన్‌ కళ్యాణ్‌ ఫోటో, యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్ కావడం విశేషం. పవన్‌ వీరాభిమానులు ఆయన్ని ఇలా చూసి ఊగిపోతున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

దీంతో నెటిజన్లు, కామన్‌ పీపుల్‌ సైతం షాక్‌ అవుతున్నారు. పవన్‌ ఇమేజ్‌, ఫాలోయింగ్‌కి ఆశ్చర్యపోతున్నారు. పవన్‌ ఫాలోయింగ్‌ అందరికి తెలిసిందే, కానీ ఇలా జస్ట్ తన ట్విట్టర్‌ అకౌంట్‌ డీపీ మారిస్తేనే ఇంత హంగామా చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారు. జస్ట్ డీపీ మారిస్తే ఇంత రచ్చనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఆర్మీ సునామీకి నోరెళ్లబెడుతున్నారు. 

ఇక పవన్‌ కళ్యాణ్‌ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కువగా రాజకీయాలకు టైమ్ కేటాయిస్తున్నారు. సినిమాలను సందిగ్దంలో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన క్రిష్‌ దర్శకత్వంలో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించనున్నారు. అలాగే సముద్రఖని డైరెక్షన్‌లోనూ `వినోదయ సిత్తం` చిత్రం రీమేక్‌లోనూ నటించనున్నట్టు టాక్‌.