ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్‍గా ప్రస్తుతం (ఆగస్టు 27) టాప్ ట్రెండింగ్ మూవీగా బ్రో ఉంది. 

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), సాయి ధరమ్‌ తేజ్‌(Sai dharam tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో(Bro)’. తమిళంలో మంచి సాధించిన వినోదయ సీతం(Vinodaya seetham) చిత్రానికి ఇది తెలుగు రీమేక్. సముద్రఖని(Samutirakhani) దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్(Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. కేతిక శర్మ(Kethika sharma), ప్రియా ప్రకాశ్ వారియర్(Priya prakash varior) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా జులై 28 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. 

‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా.. వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఓటీటీ విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఇది అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రం ఓటిటిలోనూ డిజాస్టర్ అవుతుందని యాంటి ఫ్యాన్స్ ఓటిటి రిలీజ్ కు ముందునుంచి సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. అయితే వాళ్ళకు ఇప్పుడు ట్విస్ట్ పడింది. వీకెండ్ లో ఈ సినిమా దుమ్ము రేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది.

బ్రో సినిమాకు నెట్‍ఫ్లిక్స్ లో నేషనల్ వైడ్‍గా ఆదరణ భారీగా లభిస్తోంది. దీంతో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్‍గా ప్రస్తుతం (ఆగస్టు 27) టాప్ ట్రెండింగ్ మూవీగా బ్రో ఉంది. నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ బ్రో చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తుండడానికి ఇది కూడా ఓ కారణంగా అయ్యిండవచ్చు. మొత్తంగా బ్రో సినిమా ఓటీటీలోనూ దూకుడు చూపించటం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. మనిషి జీవితకాలం సంపాదనపై పడి కుటుంబాన్ని, బంధాలను, బాధ్యతలను విస్మరించి బ్రతికేయడం సరైన పద్ధతి కాదనే సత్యాన్ని ఈ సినిమాలో చూపించారు.

చిత్రం స్టోరీ లైన్ ఏంటంటే...తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్) అన్ని బాధ్య‌త‌లను త‌న భుజాన మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడు స్థిర‌ప‌డాల‌ని... ఉద్యోగంలో త‌ను మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని నిరంతరం శ్ర‌మిస్తుంటాడు. ఓ రోజు ఊహించ‌ని రీతిలో ఓ రోడ్డు ప్ర‌మాదంలో మరణిస్తాడు. త‌న‌వాళ్లెవ‌రూ జీవితంలో స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ఎన్నో ప‌నులు మిగిలిపోయాయ‌ని.. త‌న జీవితానికి ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) అనే దేవుడి ముందు మొర‌పెట్టుకుంటాడు. దాంతో కాలం అనుగ్ర‌హించి 90 రోజులు అత‌డి జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్న‌వ‌న్నీ చేశాడా? అత‌డివ‌ల్లే ప‌నుల‌న్నీ అయ్యాయా? అనేదే ఈ సినిమా కథాంశం.