కరోనా ఫ్రభావంతో సినిమా రిలీజ్ లు అన్నీ తారు మారు అయ్యాయి. దాంతో రిలీజ్ డేట్స్ ఇవ్వలేక రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు పెద్ద సినిమాల మేకర్స్. ఇక ఇప్పుడు అసలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్(Bheemla Nayak) రిలీజ్ డేట్ వచ్చేసింది.

పవర్ స్టార్ పవలన్ కల్యాణ్(Pawan Kalyan) – రానా(Rana) కాంబినేషన్ లో.. సాగ్ చంద్ర డైరెక్షన్ లో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. తెరకెక్కిన సినిమా భీమ్లానాయక్(Bheemla Nayak). మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా రిలీజ్ పై కోవిడ్ ప్రభావం గట్టిగా పడింది. ఫాస్ట్ గానే కంప్లీట్ అయిన భీమ్లానాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తామంటూ ముందుగా ప్రకటించారు. అయితే ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ హడావిడితో ఫిబ్రవరి 25 కి రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు టీమ్.
ఇక పిబ్రవరి 25 రిలీజ్ అంటూ ప్రకటించినా.. అప్పటికి కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియక పెద్ద సినిమాలన్నీ తర్జన బర్జన పడుతూ.. రెండు రిలీజ్ డేట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే ఈనెల 25 కాని ఏప్రిల్ 1న కాని రిలీజ్ చేస్తామంటూ. ముందు ప్రకటించారు. ఇక ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో పక్కా రిలీజ్ డేట్ తో భీమ్లా నాయక్ థియేటర్లలో సందడి చేయబోతుంది.
భీమ్లా నాయక్(Bheemla Nayak) ను ఈనెల 25నే రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేధికగా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నామంటూ.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈమూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటించగా.. రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటించింది.