పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా క్యాన్సిల్ అయినట్లు సమాచారం అందుతుంది.

పవన్ లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ (Bheemla nayak)విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలోనే చిత్ర ట్రైలర్ విడుదలకు ఏర్పాటు చేశారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేశారు. ఈ దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా విషయాన్ని తెలియజేశారు. విషాద సంఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక(Bheemal Nayak Prerelease Event) నిర్వహించడం లేదన్నారు. 

''ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది'' అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

అలాగే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ రావాల్సి ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్. ప్రియమిత్రుడు హఠాన్మరణంతో కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనితో ఆయన ఎటువంటి వేడుకలలో పాల్గొనే స్థితిలో లేరు. ఇక నేడు గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించనున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు రావాల్సి ఉండగా, ఎల్లుండి అంత్యక్రియలు జరగనున్నాయి. 

దీంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సందిగ్ధంలో పడింది. భీమ్లా నాయక్ మూవీ విడుదలకు నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి.