ఒకరోజు ముందే అనగా మార్చి 24 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానున్నట్లు హోస్ట్ స్టార్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ జాతర జరగనుందన్నారు.
రీసెంట్ గా ఓటిటిలో విడుదలైన భీమ్లా నాయక్ రకరకాల విషయాలకు వేదికగా మారుతోంది. మామూలుగానే పవర్ స్టార్ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ కు పండగ. అందులోనూ రికార్డులు బద్దలుకొట్టిన సినిమా ఓటిటిలో వస్తోందంటే అంటే ఆ ఎనర్జీ వేరు. అలాంటి సినిమాకు ఓ రేంజిలో వ్యూస్ వస్తాయని అందరూ భావించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూసారు. అయితే ఆర్.ఆర్.ఆర్ వచ్చి వాళ్ల ఆశలపై గండికొట్టింది. పవన్ ఫ్యాన్స్ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఉన్నారు. అందులో రామ్ చరణ్ ఉండటం కారణం. మరో ప్రక్క మామూలు జనం సైతం ఓటిటిలో భీమ్లానాయక్ ని మెల్లిగా చూడచ్చు..ముందు ఆర్.ఆర్.ఆర్ ని ఓ సారి చూసేస్తే పని అయ్యిపోతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది చూసేసి ..నచ్చినవాళ్లు..నచ్చనివాళ్లు పోటిలుగా డిస్కషన్స్ మొదలెట్టేసారు.
వాస్తవానికి మార్చి 25 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానుంది. అయితే ఊహించని విధంగా ఈ డేట్ ని చేంజ్ చేశారు. ఒకరోజు ముందే అనగా మార్చి 24 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానున్నట్లు హోస్ట్ స్టార్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ జాతర జరగనుందన్నారు. ఆర్.ఆర్.ఆర్ హడావిడిలో ఉన్న టైమ్ లో భీమ్లాని విడుదల చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఈ ఓటిటి రిలిజ్ లో తమకు ఇష్టమైన 'అంత ఇష్టం' సాంగ్ కూడా చూసారు. ఓటిటి వెర్షన్ లోనూ ఆ పాట కనపడలేదు. అది చాలా నిరాశగా అనిపించింది ఫ్యాన్స్ కు. అయితే ఆహా,డిస్నీ హాట్ స్టార్ రెండూ హక్కులు పొందటంతో ఎవరికివారు ఈ సినిమాని ప్రమోట్ చేసే విషయంలో ఎవరికి వారు కొత్త దారులు వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వంద మిలియన్ నిమిషాల వ్యూస్ కు చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించిందని ఆల్రెడీ ఆహా పబ్లిసిటీ మొదలెట్టింది.
మరోవైపు హాట్ స్టార్ నేనేం తక్కువ తినలేదంటూ ఏకంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ లో చిన్న స్టేజి వేయించి దాని మీద ఈ సినిమా కటవుట్లతో పాటు టైటిల్ లోగో ఇతరత్రా గ్రాండ్ గా ప్రదర్శనకు పెట్టింది. అక్కడో చిన్న ఈవెంట్ చేసే ప్లానింగ్ లో సదరు సంస్థ ఉందని తెలుస్తోంది. అలాగే కొద్దిరోజుల క్రితం ఆహాలో స్ట్రీమింగ్ కు ముందు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని పిలిపించి కొత్త ట్రైలర్ ని లాంచ్ చేయించారు.హాట్ స్టార్ తన యాప్ ని అప్ గ్రేడ్ చేసుకున్న వాళ్లకు స్పెషల్ సర్ప్రైజ్ అంటూ పబ్లిసిటీ చేసింది. ఇలాంటి ట్రెండ్ గతంలో ఎప్పుడూ చూడనిది. మా ప్లాట్ ఫార్మ్ లోనే చూడమని పదే పదే కోరుతూ ఒకే సినిమా గురించి రెండు డిజిటల్ కంపనీలు పోటీ పడటం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అలాగే చాలా వెబ్ సైట్స్ కు యాడ్స్ ఇచ్చారు. దీనికోసం బడ్జెట్ ని భారీగా కేటాయించుకుని ఖర్చు పెడుతున్నారు. థియేటర్ల నుంచి వెళ్ళిపోయినా కూడా భీమ్లా ఈ రకంగా సంచలనాలకు వేదికగా మారింది.
