Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్‌ తెచ్చిన బ్యూటీఫుల్‌ మెమొరీ.. కొడుకు అకీరా నందన్‌కి పవన్‌ నేర్పిన పద్ధతులు చూశారా?

పవన్‌ కళ్యాణ్‌ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగడం చాలా అరుదు. తాజాగా ఆయన రిలాక్స్ అవుతూ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉంది.
 

pawan kalyan beautiful family pic viral akira Nandan special attraction why? arj
Author
First Published Jun 23, 2024, 3:59 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎంగా రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలతో బిజీగా గడుపుతున్నాడు. ఆయన నటించాల్సిన సినిమాల పరిస్థితేంటనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పవన్‌ ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటీఫుల్‌ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. పవన్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పిక్‌ ని పంచుకుంది జనసేన పార్టీ సోషల్‌ మీడియా టీమ్‌ 

ఈ నెల 12న ఏపీ ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంగళగిరిలోని తన నివాసానికి బయలుదేరాడు. మధ్యలో ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చేసేదేం లేక రోడ్డు పక్కన కాసేపు వాహనాన్ని ఆపేశారు. కాసేపు సరదాగా గడిపారు. ఇందులో తనతోపాటు భార్య అనా కొణిదెల, కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యలు ఉండటం విశేషం. 

ఈ నలుగురు కలిసి కెమెరాకి పోజులిచ్చింది. పవన్‌ ఫ్యామిలీ పిక్‌ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. పవన్‌ ఇలా తన ఫ్యామిలీతో ఫోటోలు దిగడం చాలా అరుదు. దీంతో ఈ లేటెస్ట్ ఫోటో ఎంతో అందంగా ఉంది. ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. తన కొడుకు అకీరా, ఆద్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం. పవన ఏపీ ఎన్నికల్లో గెలిచినప్పట్నుంచి కొడుకు కూతురు, ఆయనవెంటనే ఉన్నారు. ఫలితాలకు ముందే ఈ ఇద్దరు ఆయన ఇంటికి చేరారు. ఆ సక్సెస్‌ సెలబ్రేషన్‌ని దగ్గరుంచి ఎంజాయ్‌ చేశారు. అకీరా నందన్‌ అయితే పవన్‌ వెంటే ఉన్నాడు. చంద్రబాబుని కలిసినప్పుడు, అలాగే ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా అకీరా నందన్‌ ఉన్నాడు. దీంతో అకీరా నందన్‌ ని పవన్‌ కావాలనే ఎలివేట్‌ చేస్తున్నాడని, త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడనే హింట్‌ ఇచ్చేందుకు ఈ పని చేశాడని అంతా అనుకున్నారు. 

ఇదిలా ఉంటే తాజా ఫోటోలో అకీరా నందన్‌ పంచె కట్టుకుని కనిపించాడు. రెడ్‌ షర్ట్, వైట్‌ పంచెతో ఉన్నాడు. ఇలా తెలుగు సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నాడు పవన్‌. కొడుక్కి ఆ పద్ధతులు నేర్పించాడు. అకీరా కూడా తండ్రి జాడలోనే పయనించడం విశేషం. 

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాల్లో నటించాల్సి ఉంది. `ఓజీ`, `ఉస్తాడ్‌ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్‌లో మధ్యలో ఉన్నాయి. పవన్‌ వస్తే కంప్లీట్‌ అవుతాయి. అయితే `హరిహర వీరమల్లు` షూటింగ్‌ ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. నిర్మాతలకు పవన్‌ హామీ ఇచ్చాడట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన సినిమాల్లో పాల్గొనడం కష్టంగానే కనిపిస్తుంది. పైగా ప్రభుత్వంలో ఉండి, డిప్యూటీ సీఎంగా ఉండి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సినిమాలు చేయకూడదనే రూల్‌ కూడా ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా సినిమాల పరిస్థితేంటనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios