100 మిలియన్ల హుష్ కాకి.. రికార్డులు బ్రేక్ చేస్తున్న బాలయ్య, పవన్ ఎపిసోడ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో నిన్నటిని నుంచి ప్రసారం మొదలయింది. సహజంగానే బిడియంతో ఉండే పవన్.. గోల గోల చేసే బాలయ్య మధ్య సంభాషణ ఎలా జరిగింది అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో నిన్నటిని నుంచి ప్రసారం మొదలయింది. సహజంగానే బిడియంతో ఉండే పవన్.. గోల గోల చేసే బాలయ్య మధ్య సంభాషణ ఎలా జరిగింది అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది. అంచనాలకు తగ్గట్లుగానే తొలి ఎపిసోడ్ సూపర్ హిట్ గా నిలిచింది.
అంచనాలకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కేవలం 14 గంటల్లోనే ఈ ఎపిసోడ్ ఆహా యాప్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి చేరుకుంది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్లకి చేరుకున్న పవన్ ఎపిసోడ్ రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే తొలి 90 మినిషాలలో అత్యధిక వ్యూస్ సాధించిన ఎపిసోడ్ గా కూడా రికార్డ్ సృష్టించింది. రికార్డు స్థాయిలో యాప్ లాంచెస్ కూడా నమోదయ్యాయి.
బాలయ్య పవన్ ని రాజకీయాల గురించి, వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళు, త్రివిక్రమ్ తో స్నేహం ఇలా పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. బాలయ్య అల్లరిని పవన్ ఎంజాయ్ చేస్తూనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫోన్ లో బాలయ్యతో సంభాషించడం, మధ్యలో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో హైలైట్స్ గా చెప్పొచ్చు.
గతంలో ప్రభాస్ ఎపిసోడ్ తో ఉన్న రికార్డ్ ని పవన్ ఎపిసోడ్ అధికమించినట్లు అయింది. ప్రభాస్ ఎపిసోడ్ కి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి 42 గంటల్లో రీచ్ అయింది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వేదికలపై కలుసుకోలేదు. దీనితో నందమూరి, మెగా అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు.