వాళ్లపై మండిపడ్డ పవన్

దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ప్రోత్సాహంతో సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై యువనటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తూ డిబేట్లు నిర్వహించిన టీవీ ఛానెళ్లపై పవన్ కల్యాణ్‌ మండిపడుతున్నారు.

ఫిలిం ఛాంబర్‌ నుంచి వెళ్లిపోయిన పవన్ కల్యాణ్‌ తాజాగా ట్వీట్ చేస్తూ.. 'నా తల్లిపై అసభ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ఎంపీ సుజనా చౌదరి లేదా ఆయన బినామీ నుంచి నిధులు పొందుతున్న మహాన్యూస్‌ టీవీ పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది.. మహాటీవీ సీఈవో మూర్తి గారు కూడా..' అంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ చేశారు.

కాగా, టీవీ9 రవి ప్రకాశ్‌, శ్రీని రాజులపై కూడా ఈ రోజు ఉదయం పవన్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అందుకు ఆధారాలు ఇవేనంటూ పవన్.. శ్రీని రాజుపై మళ్లీ ట్వీట్ చేశారు. ఆయన కొత్త ఫొటో ఇది అని ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, ఆయనకు టీవీ9లో 88.69% షేర్‌ ఉందని అన్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…