రాష్ట్రంలోని వీఆర్వోలు అందరూ ధియేటర్ల వద్దకు వెళ్లి జీవో నెంబర్ 35 ప్రకారం టికెట్ ధరలు అమ్ముతున్నారా? లేదా? అనేది చెక్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో, ప్రస్తుతం అధికారులంతా “భీమ్లా నాయక్” సినిమా ధియేటర్లకు పయనమవ్వటం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ మరింతగా మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాను టార్గెట్ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అభిమానులు మండిపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కన్నా జగన్ కు ‘భీమ్లా నాయక్’ సినిమాను దెబ్బ తీయడం ముఖ్యమైపోయిందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా జగన్ ప్రభుత్వం మళ్ళీ అనేక ఆంక్షలను అమలులోకి తేవటమే అందుకు కారణం.
రాష్ట్రంలోని వీఆర్వోలు అందరూ ధియేటర్ల వద్దకు వెళ్లి జీవో నెంబర్ 35 ప్రకారం టికెట్ ధరలు అమ్ముతున్నారా? లేదా? అనేది చెక్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో, ప్రస్తుతం అధికారులంతా “భీమ్లా నాయక్” సినిమా ధియేటర్లకు పయనమవ్వటం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ మరింతగా మండిపడుతున్నారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఎగస్ట్రా షోలు వేయొద్దని, టికెట్ల ధరలు తగ్గించాలంటూ థియేటర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోందంటూ సినీ హీరో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నిన్న రాత్రి కొత్తవలసలో రాస్తారోకో చేపట్టారు. కొత్తవలస-విజయనగరం మార్గంలో ఉన్న రెండు సినిమా థియేటర్ల కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సినిమా విడుదలను ఆపాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాంతో రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నాయకులు గొరపల్లి రవి, జి.అప్పారావును అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులంతా స్టేషన్‌కు తరలివెళ్లారు. రాస్తారోకో సరైన చర్యకాదని ఎస్సై వీరజనార్దన్ వారికి చెప్పి బైండోవర్‌చేసి పంపించారు. అయితే రూల్స్ నేపథ్యంలో సినిమాను ప్రదర్శించలేమని పలువురు థియేటర్ల యజమానులు బాహాటంగానే చెప్పటం జరుగుతోంది.