బాలీవుడ్ స్టార్ బ్యూటీ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా పరిణీతి చోప్రా సినిమాలు కొనసాగిస్తోంది. 

పరిణీతి చోప్రా భర్త రాఘవ్ చద్దా. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పరిణీతి చోప్రా వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె గురించి రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పరిణీతి చోప్రా గర్భవతి అంటూ బిటౌన్ మొత్తం కోడై కూసింది. 

పరిణీతి, రాఘవ్ దంపతులు త్వరలో మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనితో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. రూమర్స్ ఎక్కువవుతుండడంతో పరిణీతి చోప్రా సన్నిహితులు స్పందించారు. పరిణీతి చోప్రా గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చారు. 

ప్రస్తుతం పరిణీతి చోప్రా, రాఘవ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. పరిణీతి చోప్రాకి రీసెంట్ గా బిగ్ ఆఫర్ మిస్ అయింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనుకున్నది పరిణీతినే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చింది.