బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ పరమ్ సుందరి ట్రైలర్‌కు మలయాళీ ఇన్‌ఫ్లువెన్సర్లు ప్రతిస్పందించిన విధానం వివాదానికి దారితీసింది. ఈ ట్రైలర్‌పై భిన్నంగా స్పందించిన వారి వీడియోలు, రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

DID YOU
KNOW
?
పరమ్ సుందరి వివాదం
జన్వీ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమా రిలీజ్ కు ముందే మలయాళంలో వరుస వివాదాలు ఫేస్ చేస్తోంది.

బాలీవుడ్ రొమాంటిక్ మూవీ పరమ్ సుందరి

జన్వీ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమా ట్రైలర్ గత మంగళవారం విడుదలైంది. బాలీవుడ్ లో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకర్శించే విధంగా పరమ్ సుందరి మూవీని రూపొందించారు టీమ్. నార్త్ ఇండియన్ యంగ్ స్టర్ పరమ్ తో మలయాళీ యువతి సుందరి మధ్య ప్రేమకథగా ఈసినిమా రూపొందించబడింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌరవ్ మిశ్రా , ఆర్ష్ వోరా స్క్రిప్ట్ రచన చేశారు.

పరమ్ సుందరి ట్రైలర్ వివాదం

అయితే పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఈ ట్రైలర్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు మలయాళీలు. ఇక మరీ ముఖ్యంగా మలయాళీ కంటెంట్ క్రియేటర్లు అయితే ఈ సినిమాకు వ్యతిరేకంగా స్పందిస్తూ.. విమర్శలు చేశారు. ప్రముఖ ఇన్‌ఫ్లువెన్సర్ పవిత్రా మీనన్ మాట్లాడుతూ, "కేరళ మహిళలు రోజూ మల్లెపూలు ధరించి, మోహినీయాట్టం చేస్తూ తిరగరు. అలాంటివి చూపించడం చాలా తప్పు," అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఒక వీడియోపై, పరమ్ సుందరి మూవీని నిర్మించిన మద్దోక్ ఫిలింస్ కంప్లైయింట్ చేయగా, అది హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది.

పవిత్ర మీనన్ కు నోటీసులు

ఈ రకంగా ఇన్ స్టా గ్రామ్ నుంచి పవిత్ర మీనన్ కు నోటీస్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మీనన్ షేర్ చేసిన నోటీసులో, “ఈ కంటెంట్‌ను మూడవ పార్టీ నుంచి వచ్చిన హక్కుల దావా కారణంగా తొలగించాం. మీరు ఈ తొలగింపును అన్యాయంగా భావిస్తే, మీరు నేరుగా ఫిర్యాదు చేసిన పార్టీతో సంప్రదించవచ్చు,” అని పేర్కొంది. ఈ వీడియోలో ఆమె నవ్వుతూ మాట్లాడుతూ, “మైన్ తెక్కపటిల్ దామోదరన్ సుందరం పిల్లై కేరళా సే... ఐ మీన్, జన్వి మీద ఎలాంటి ద్వేషం లేదు కానీ, ఇంతగా యాక్ట్ చేయాల్సిన అవసరమేమిటి?” అని వ్యాఖ్యానించారు.

వీడియోను తొలగించిన తరువాత కూడా..పవిత్రా మీనన్ అదే వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది. మరో క్రియేటర్ కూడా తమ వీడియోలపై కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, “సరైన పరిశోధన లేకుండా కేరళ సంస్కృతిని ఇలా కమర్షియల్ గా ఉపయోగిస్తారా, ఈ విషయంలో విమర్శించడానికి మాకు హక్కు ఉంది,” అన్నారు.

View post on Instagram

పరమ్ సుందరి మరిన్ని వివాదాలు

ఇక ఈ ట్రైలర్ పై రకరకాల వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ట్రైలర్ లో జన్వి కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా రొమాంటిక్ సీన్స్ పై పెద్ద వివాదమే రాజుకుంది. చర్చిలో వీరు హగ్ చేసుకున్న సీన్స్ చిత్రీకరించడంతో అది వివాదంగామారింది. పవిత్ర మత స్థలాల్లో ఇలాంటి పనులు చేస్తారా? అంటూ వివాదం చెలరేగింది. అంతే కాదు ఈ ట్రైలర్ చివర్లో జన్వి కపూర్ చెప్పే డైలాగ్ కూడా చర్చకు దారితీసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. రజనీకాంత్ నుండి అల్లూ అర్జున్ వరకూ దక్షిణ భారత స్టార్‌లు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలను వివరించే సన్నివేశం ఉంది. ఈ సీన్ పై కూడా రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. అయితే ఈసినిమాలో రకరకాల కల్చర్స్ ను వారు చూపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయితే కాని.. వీటిపై క్లారిటీ వచ్చే అవకాశంలేదు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోల తొలగింపు, మద్దోక్ ఫిలింస్ చర్యలపై నెటిజన్లు, ఫాలోవర్లు, విభిన్నంగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకా, మలయాళీ ఇన్‌ఫ్లువెన్సర్లు తమ అభిప్రాయాలను తెలుపుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈసినిమా ట్రైలర్ ఇంత వివాదం క్రియేట్ చేస్తే, మలయాళంలో రిలీజ్ తరువాత ఇంకెన్ని వివాదాలు క్రియేట్ అవుతాయి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ప్రపంప వ్యాప్తంగా పరమ్ సుందరి సినిమా అగస్ట్ 29 న రిలీజ్ కాబోతోంది.