Asianet News TeluguAsianet News Telugu

'ఆచార్య' తో పోలిక డైరక్టర్ ని బాగా భయపెట్టిందిగా!

ఆచార్య సినిమాతో పోలుస్తూ కామెంట్స్ చేయడంతో భయపడ్డాం. మేం అనుకున్నది ఒకటి అయితే.. సినిమా వేరే కోణంలో వెళ్లిందని కంగారు పడ్డాం. 

Panja Vaisshnav Tej #Aadikeshava director fear about #Acharya Movie shades jsp
Author
First Published Nov 18, 2023, 12:25 PM IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం  పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ‘ఆచార్య’ రిలీజ్ త‌ర్వాత ఇటు ఫ్యాన్స్‌ని, అటు ప్రేక్ష‌కుల‌కు సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి ఆట నుంచే ఆశించిన టాక్‌ను రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఆచార్య మూవీ మెగా డిజాస్ట‌ర్ అని అని తేల్చాసాయి ట్రేడ్ వ‌ర్గాలు. అయితే ఇదంతా గతం ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఆచార్య చిత్రం ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ చిత్రం.

ఆదికేశవ టీజర్ విడుదల తర్వాత ఆదికేశవ సినిమాని ఆచార్యతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేయడంతో భయపడ్డామని చెప్పుకొచ్చారు ఆదికేశవ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి.ఆచార్యతో  పోలికపై వివరణ ఇచ్చాడు.  పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఈ నెల 24న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ ఖరారు కావడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలెట్టారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆదికేశవ సినిమాపై వస్తున్న రూమర్స్‌కి దర్శకుడు బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు.
 
దర్శకుుడ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...టీజర్‌లో చూపించిన సన్నివేశాన్ని చూసి.. ఇదేదో ఆచార్య సినిమాలా ఆలయాన్ని సంరక్షించే సినిమా అని అంతా అనుకున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఇది అలాంటి సినిమా కాదు. హీరో పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. సినిమా టైటిల్, హీరో పేరు ప్రకారం కథలో శివుడి ప్రస్తావన తీసుకువచ్చాను అంతే. ఇది టెంపుల్‌ని సంరక్షించే కథ కాదు. శివుడు కనిపించే అంశాలతో ప్రచారం మొదలు పెట్టాలని.. టీజర్‌ని అలా కట్ చేశాం. అది చూసిన వారిలో కొందరు ఆచార్య సినిమాతో పోలుస్తూ కామెంట్స్ చేయడంతో భయపడ్డాం. మేం అనుకున్నది ఒకటి అయితే.. సినిమా వేరే కోణంలో వెళ్లిందని కంగారు పడ్డాం. అలా అనుమానాలు వ్యక్తం చేసిన అందరికీ చిత్ర ట్రైలర్‌తో సమాధానం ఇవ్వబోతున్నాం

నవంబర్ 17న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నామని దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల 17 వ తేదీన ఈ ట్రైలర్ విడుదల కాలేదు.  ఈ విష‌యాన్ని తెలుపుతూ… ”సాంకేతిక సమస్యల‌ కారణంగా మా ‘ఆదికేశవ’ (Aadikeshava) ట్రైలర్ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఈ చివరి నిమిషంలో ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను రద్దు చేసినందుకు.. అలాగే మీకు కలిగించిన అసౌకర్యానికి మా మీడియా మిత్రులకు, అభిమానులందరికీ మేము క్షమాపణలు కోరుతున్నాము అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చింది   శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఆదికేశవ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వైష్ణవ్‌కు ఇది నాల్గవ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios