యంగ్ హీరో తేజా సజ్జా Teja Sajja తన లేటెస్ట్ ఫిల్మ్ ‘హనుమాన్’ HanuMan మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రిలీజ్ కు ముందే తనకు పాన్ ఇండియా నిర్మాత గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ Prashanth Varma కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘హనుమాన్’. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సూపర్ హీరో ఫిల్మ్ గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇండియాలోని ప్రధానమైన రీజినల్ లాంగ్వేజెస్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ ఆయా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు టీమ్.
ఈ క్రమంలో ఈరోజు కొచ్చి టూర్ లో టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తేజా సజ్జా పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ Abhishek Agarwal తేజా సజ్జాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రిలీజ్ కు ముందే తేజాకు బంగారు ఉంగరం బహుమతిగా ఇచ్చారు. సినిమా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా తేజా స్వయంగా ఆ ఫొటోను తన ఇన్ స్టా వేదికన పంచుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కు తమ సినిమాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పారు. ఇక యూనిట్ ప్రస్తుతం ఇండియా మొత్తం ‘హనుమాన్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జనవరి 4న - కొచ్చి, జనవరి 5న - చెన్నై, జనవరి 6న - బెంగళూరు, జనవరి 7న - హైదరాబాద్, జనవరి 8న - ముంబై, జనవరి 9న - ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ‘హనుమాన్’ మూవీ ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh babu - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ Guntur Kaaram తో కలిసి ఒకే రోజున విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. మహేశ్ బాబు సినిమాకు ధీటుగా ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఎలాంటి రిజల్ట్ ఉండబోతోందోననేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

