Bigg Boss Telugu 7; స్ట్రాంగ్‌గా ఉన్నాడని ప్రశాంత్‌ని పీకేశారు.. హౌజ్‌లో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు..
హౌజ్‌లో గ్రూపు రాజకీయాలు బయటపట్టాయి. ఒకరిని మరొకరు టార్గెట్ చేయడం వంటివి ఆసక్తికరంగా సాగాయి. ఇక ఇందులో తేజ నిద్ర పోయిన కారణంగా బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్ గౌతమ్.. తేజకి ఫనీష్‌మెంట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు 7.. బుధవారం ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో హౌజ్‌లో గ్రూపు రాజకీయాలు బయటపట్టాయి. ఒకరిని మరొకరు టార్గెట్ చేయడం వంటివి ఆసక్తికరంగా సాగాయి. ఇక ఇందులో తేజ నిద్ర పోయిన కారణంగా బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్ గౌతమ్.. తేజకి ఫనీష్‌మెంట్ ఇచ్చాడు. అందుకుగానూ అమ్మాయిలా చీరకట్టుకుని ఉండాల్సి ఉంటుంది. దీంతో శోభా శెట్టి.. తేజకి చీరకట్టి రెడీ చేసింది. కాసేపు అమ్మాయిలా ప్రవర్తించి నవ్వులు పూయించారు. అమ్మాయిలు అమ్మాయిలు కలుసుకున్నప్పుడు హగ్ చేసుకుంటారు కదా అని శోభా శెట్టిని, రతిక, ప్రియాంకలను హగ్ చేసుకుని లోలోపల ఆనందాన్ని పొందాడు తేజ. మరోవైపు శివాజీతోనూ అన్నా, చెల్లేల్లా ఉన్నామని చెబుతూ అలరించారు.
మరోవైపు హౌజ్‌లో గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో శివాజీ, యావర్, ప్రశాంత్, రతిక, ఒక వైపు, అమర్ దీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్ మరో గ్రూపుగా మారి ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. శివాజీ టార్గెట్‌గా వారు ఆరోపణలు చేయడం విశేషం. అమర్ దీప్.. తనని జీరో చేశారని, అంతేకాదు విలన్‌గా మార్చేశారని గుసగుసలాడాడు. మరోవైపు వీరిని ఉద్దేశించి శివాజీ కూడా కామెంట్ చేశాడు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్, యావర్‌లకు హితబోధ చేశాడు. ఎవరు ఎలా ప్రోవోక్ చేసిన ఆవేశానికి గురి కావద్దని, నవ్వుతూ రియాక్ట్ అవ్వాలని, కూల్‌గా, కామ్‌గా ఉండాలని తెలిపారు.
ఇక ఈ వారం కెప్టెన్స్ టాస్క్ ఇచ్చాడు. అందుకోసం బిగ్ బాస్.. హౌజ్‌ని వీరసింహాలు, గర్జించే పులులు అనే రెండు గ్రూపులుగా విడగొట్టాడు. యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా శెట్టి, రతిక వీర సింహాలు గ్రూపులో, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక, అశ్విని గర్జించే పులులు టీమ్‌లో ఉంటారు. వీరికి మొదటగా బాల్స్ ని పట్టుకునే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా బాల్స్ ని వారికిచ్చిన ప్యాకెట్‌లోనే భద్రపరచాయి. లేదంటే అవి కౌంట్‌లోకి రావు, దీనికి సంబంధించి హౌజ్‌లో నానా తిప్పలు, నానా కుట్రలుజరుగుతున్నాయి.
ఓ వైపు ఈ టాస్క్ ఉండగానే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బెలూన్స్ ని టైర్లలో ఫిల్ చేయడం. ఇందులో వీరసింహాలు టీమ్ గెలుపొందింది. దీనికిగానూ వారికి పవన్ బాక్స్ వస్తుంది. అందులో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రత్యర్థి టీమ్‌లో ఒకరిని ఆట నుంచి తొలగించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రశాంత్‌ని తొలగించారు. దీంతో అతను కన్నీళ్లు పెట్టుకున్నారు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి కాబట్టే తొలగించారని గర్వపడాలని ఓదార్చేప్రయత్నంచేశాడు శివాజీ. చివరికి పుష్ప అంటూ డైలాగ్ చెప్పడం విశేషం.