Asianet News TeluguAsianet News Telugu

‘పలాస 1978’ లో అసలు మ్యాటర్ అదే.. వివాదాస్పదం?

ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా  ఈ రోజు (మార్చి 6)న విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజైన  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో  'పలాస 1978'  ఏముంది. ఏ కంటెంట్ తో వస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు  'ప‌లాస‌' కథ...

Palasa 1978 is an off-beat crime drama
Author
Hyderabad, First Published Mar 6, 2020, 9:41 AM IST

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా  ఈ రోజు (మార్చి 6)న విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజైన  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో  'పలాస 1978'  ఏముంది. ఏ కంటెంట్ తో వస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు  'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేయ‌బోతోంది అని చెప్పుకోబోతున్నారు. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారని చెప్తున్నారు. 

ఈ సినిమాలో రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులకు సైతం బ‌హుజ‌నులు ఎలా దూరం అవుతున్నారో, అందుకు కార‌ణం ఎవ‌రో - నిజాల్ని నిర్భ‌యంగా చెప్పే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని చెప్తున్నారు. అలాగే సెన్సార్ కు అందకండా కొన్ని వివాదాస్ప‌ద అంశాల్నీ ఇందులో ట‌చ్ చేశారని, అవి సినిమా విడుద‌ల‌య్యేక  చ‌ర్చ‌నీయాంశాలుగా మారే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పుకుంంటున్నారు. 

కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘చాలా చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన నేను ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడవుతున్నా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోనున్న  తొలి చిత్రం మాదే’’ అన్నారు నిర్మాతలు.  

రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios